
కడప ( Penneru news) :
ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వైసిపి కార్యకర్తలకు నాయకులకు పార్టీ అండగా ఉంటుందని, పార్టీ నాయకుడిగా బిసి వర్గాన్ని చెందిన నేతగా అండగా ఉంటానని వైసీపీ ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ అన్నారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వైసిపి కార్యకర్తను వైఎస్ఆర్సిపి బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్ పరామర్శించి ధైర్యం చెప్పారు. శుక్రవారం రాత్రి వైయస్సార్ జిల్లా, పెండ్లిమర్రి మండలం, గోపరాజుపల్లె గ్రామంలో టిడిపి వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడిన బీసీ కులానికి చెందిన వైసీపీ కార్యకర్త నంద్యాల సుబ్బరాయుడు ను కడప రిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆసుపత్రి వైద్య సిబ్బందితో మాట్లాడి, నంద్యాల సుబ్బరాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఎమ్మెల్సీ కోరారు.

ఎమ్మెల్సీ రమేష్ యాదవ్