
వేంపల్లి (పెన్నేరు న్యూస్) జనవరి 23: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత జాతీయ సైన్యాధిపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేటి భారతీయులకు ఎంతో ఆదర్శనీయుడు అభినందనీయుడని స్థానిక వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చెరసాల యోగాంజనేయులు పేర్కొన్నారు. కళాశాల చరిత్ర శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. చరిత్ర శాఖాధ్యాపకులు బాలకొండ గంగాధర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులలో నేతాజీ అతిముఖ్యుడని స్వాతంత్రం సాధించడంలో ఆయన సేవలు ప్రశంసనీయమని అన్నారు. రెండవ స్వాతంత్రోద్యమంలో మన ప్రధాన ప్రత్యర్థి బ్రిటిష్ కష్ట కాలంలో ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకొని తన జాతీయ సైన్యం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వీరుడని కొనియాడారు. తెలుగు శాఖ అధిపతి డాక్టర్ నాగలక్ష్మి దేవి మాట్లాడుతూ జాతీయ ఉద్యమ వీరులను మనము నేటితరం ఆదర్శంగా తీసుకొని జీవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రేట్ రిబ్బన్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ ,కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ అరవింద్, లైబ్రరీ విభాగాధిపతి మాధవరావు ,రాజారెడ్డి ,ప్రసాద్ , వినోద్ , పీడి తేజేంద్ర , అధ్యాపక ఆధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు .