
జనసేన పార్టీ నేత డా దాసరి రవిశంకర్
వేంపల్లె (పెన్నేరు న్యూస్) జనవరి 26 : దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను నేటి యువతరం స్పూర్తి గా తీసుకోవాలని జనసేన పార్టీ పులివెందుల నియోజకవర్గ సీనియర్ నేత డా. దాసరి రవిశంకర్ అన్నారు.ఆదివారం 76వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని స్థానిక పట్టణం లోని పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థుల మధ్య రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డా దాసరి రవిశంకర్ మాట్లాడుతూ, మన రాజ్యాంగం చాలా గొప్పదని,మన దేశ సర్వసత్తాక ఘనతంత్ర దేశంగా ఆవిర్భవించిందని చెప్పారు.75 ఏళ్లుగా రాజ్యాంగం మన దేశానికి సమగ్రంగా మార్గ నిర్దేశం చేస్తోందని చెప్పారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తి ఎంతో గొప్పదన్నారు. రాజ్యాంగ రచన చేసి గణతంత్ర రాజ్యంగా అవతరించడం కోసం జ్ఞాన సంపదను ధార పోసిన నేతల ఆదర్శాలను ప్రతి ఒక్కరం అందిపుచ్చు కోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అనంతరం ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేసి స్వీట్లు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాగ మల్లికార్జున, మహబూబ్ బాషా, మహేష్, వెంకటేష్, శేషు, ఇమామ్ భాషా తదితరులు పాల్గొన్నారు.