
బద్వేల్ (పెన్నేరు న్యూస్) జనవరి 30:
బద్వేల్ మండలం వెంకట శెట్టిపల్లి గ్రామ పొలాల్లో బేగులూరు వ్యాపారి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. బీరం నరసింహారెడ్డి( 55) గా గుర్తించారు. కుటుంబం మొత్తం బెంగళూరులో ఉంటూ వ్యాపారం చేస్తున్నట్టుగా సమాచారం. భూ సర్వే జరుగుతుందని తెలిసి గ్రామానికి చేరుకున్న నరసింహారెడ్డి గ్రామ పొలాల్లోని అనుమానస్పద మృతి చెందాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. మృతి పై అనుమానంతో డాగ్స్ స్క్వాడ్ తో తనిఖీ. మృతదేహం మార్చురీకి తరలింపు.