
సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో కడప ఉక్కు కోసం పోరాడుదాం. DYFI
జమ్మలమడుగు, జనవరి 23 ( పెన్నేరు న్యూస్): స్వాతంత్ర్య సమరయోధుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన సైన్యంతో గడగడలాడించిన ధీరుడు జననం తప్ప మరణం లేని యోధుడు సుభాష్ చంద్రబోస్ అని ఆయన స్ఫూర్తి తో కడప ఉక్కు కోసం యువత పోరుబాట పట్టాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ తెలిపారు .సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్క రించుకొని గురువారం DYFI ఆధ్వర్యంలో జమ్మలమడుగులోని స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ నందు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, ఆజాద్ హింద్ ఫౌస్ సంస్థను స్థాపించి సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన దళంతో గడగడలాడించిన దీరశాలి అన్నారు. నాడు స్వాతంత్ర్య సమరంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని మీ రక్తాన్ని నాకివ్వండి మీకు స్వాతంత్ర్యాన్ని తెస్తాను అని ఉత్తేజభరిత మాటలతో దేశ ప్రజలను స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే ప్రయత్నం చేశాడన్నారు. ఇప్పటికీ ఆయన మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అన్నారు. పుట్టిన తేది అందరికీ తెలుసుగాని మరణం తేదీ ఎవ్వరికీ తెలియని మిస్టరీ అని అందుకే జననం తప్ప మరణం లేని గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అంతటి మహనీయుడి పోరాట స్ఫూర్తితో కడప ఉక్కు కోసం పిడికిలి బిగిద్దాం అన్నారు. పాలకుల శాపాల వల్ల కడప ఉక్కు ముందుకు అడుగులు పడడం లేదన్నారు. ఇక్కడి ప్రాంత యువత ఉద్యోగాల కోసం పరాయి రాష్ట్రాలకు, దేశాలకు వలసలు పోతున్న పాలక ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. రాబోయే కేంద్రం బడ్జెట్ సమావేశాలలో అయిన కడప ఉక్కు కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రం లోని కూటమి ప్రభుత్వం కడప ఉక్కు పై కేంద్రం పై ఒత్తిడి తెచ్చి కడప ఉక్కు కు నిధులు రాబట్టాలని కోరుతున్నాం అన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్, పట్టణ సహాయ కార్యదర్శి మహేష్ యాదవ్, నాయకులు సురేంద్ర రెడ్డి, రమేష్, సూరి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.