
మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎస్.బి.అంజాద్ భాష, నగర్ మేయర్ సురేష్ బాబు
ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు 534 వ జయంతి వేడుకలు
కడప ఫిబ్రవరి 16 (Penneru news):
కడప నగరంలోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ (కృష్ణ థియేటర్) వద్ద శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహం వద్ద జయంతి వేడుకలను వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట కృష్ణల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష, కడప నగరం కే.సురేష్ బాబు పాల్గొని శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, దక్షిణ భారతదేశ చరిత్రలో మధ్యయుగ రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు మహా కీర్తి శాలిని పేర్కొన్నారు. ఆయన పరిపాలనలో పేద బడుగు బలహీన వర్గాల వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. అలాంటి రాజనీతిజ్ఞుడు, సాహితీ సమారంగణ సార్వభౌముడు తెలుగుభాష కోసం పాటుపడటం మనకెంతో గర్వకారణమన్నారు. అంతే కాకుండా తన పరిపాలనలో వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి చెరువులు, కుంటలను తవ్వించడం, గొలుసుకట్టు కాల్వల నిర్మాణం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించి దక్షిణ భారత దేశంలో కరువు లేకుండా చేసి దేశవ్యాప్తంగా ప్రపంచ చరిత్రలో ఖ్యాతి గడించారన్నారు.
శ్రీ కృష్ణ దేవరాయలు అనేక రకాలుగా ప్రజలకు సేవలంచింది ఆదర్శంగా నిలిచిన ధీరుడన్నారు. తెలుగు ఖ్యాతిని దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపింప చేసిన ఉన్నతమైన వ్యక్తి అని అన్నారు. అదేవిధంగా దేశభాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్పిన మహానుభావుడని అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చిన తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారన్నారు. ఆయన పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో మెలిగారన్నారు. శ్రీకృష్ణదేవరాయల సేవలను స్మరించుకుంటూ మనమంతా ఆయన అడుగుజాడల్లో నడవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుమ్మలకుంట శివశంకర్, అమరప్ప, రాము,యానాదయ,కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, కార్పొరేటర్లు ఐస్క్రీమ్ రవి, మహమ్మద్ షఫీ, మల్లికార్జున కిరణ్, బసవరాజు, శ్రీరంజన్ రెడ్డి, రామచంద్రయ్య, రామ్ లక్ష్మణ్ రెడ్డి,లక్ష్మయ్య, జిలాన్, ఆరీఫ్, రెడ్డి ప్రసాద్, గంగరాజు, బాలకొండయ్య, నాయకులు దాసరి శివ, తోటా కృష్ణ, దేవి రెడ్డి ఆదిత్య, రమేష్ రెడ్డి, సుదర్శన్ రాయల్, భాస్కర్,రామ్మోహన్ రెడ్డి, వెంకట్ సుబ్బయ్య, జయచంద్రారెడ్డి, కంచుపాటి బాబు,అబ్దుల్ రఫ్,అబ్దుల్ సుభాన్, అమరేశ్వర్ రెడ్డి,రమేష్, అర్జున్, బాదుల్లా, రాయల్ బాబు, గులాం గౌస్, శంకరాపురం సింధు, సాయిబాబా, ఎం రాజగోపాల్, విజయ్ గౌడ్,మురళి, శ్రీరాములు,బన, ఎల్లారెడ్డి,గురు ప్రసాద్, ఆమంచి రాజేష్,మహిళా నాయకురాలు టి పి సుబ్బమ్మ పత్తి రాజేశ్వరి, మరియలు, రత్నకుమారి, ఉమామహేశ్వరి, స్వర్ణకుమారి, మల్లేశ్వరి, మేరీ, రామలక్ష్మమ్మ, సుజిత, శ్వేత, శివమ్మ, నాయకులు,పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.