
రాజుపాలెం (PENNERU news):
ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ఒక చక్కటి మార్గమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెరిగిపోయిన భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులను జనం ముందుకు తీసుకు వచ్చిందని వరదరాజులరెడ్డి అన్నారు రాజుపాలెం మండలం కూలూరు గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రాజుపాలెం మండల తహశీల్దార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని స్థానిక నాయకులు శాలువాలతో, పూల బుకేలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమం ద్వారా భూ యజమానులు , తమ భూములలో వున్న సమస్యలను అధికారులకు తెలిపి త్వరగా పరిష్కరించు కోవచ్చునని, తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజలకు ఈ రెవెన్యూ సదస్సు ఒక చక్కని అవకాశమని, ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకేనని తెలిపారు .గత ప్రభుత్వ హయాంలో భూములను ఆక్రమించి, సర్వే నెంబర్లు అవకతవకలు చేశారని, వాటి అన్నిటినీ కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. .ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్, రెవెన్యూ అధికారులు, అశోక్, మస్తాన్ వలీ, వరద శేఖర్ ,పంచాయితీ సెక్రటరీ వెంకటయ్య ,సచివాలయం సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, నాగరాజు, వెంకటరామి రెడ్డి, రమేష్ రెడ్డి ,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
