
ప్రొద్దుటూరు (Penneru news) :
ప్రొద్దుటూరు బి.జి.ఆర్ లడ్జిలోని రూం నెంబర్ 206లో కొప్పుల రాఘవేంద్ర అలియాస్ పప్పి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి కొంతమంది లాడ్జిలో రూము తీసుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. తెల్లారే సరికి రాఘవేంద్ర హత్యకు గురైనట్లు లాడ్జి సిబ్బంది గుర్తించి, పోలిసులకు సమాచారం అందించారు. హత్య గురైన వ్యక్తి కొప్పుల రాఘవేంద్ర అలియాస్ పప్పీ గా పోలీసులు గుర్తించారు. కొప్పుల రాఘవేంద్ర పై గతంలో ప్రొద్దుటూరులోని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మృతుడు రాఘవేంద్ర పై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్ నమోదు అయినట్లు తెలుస్తోంది.. రాఘవేంద్రను హత్య చేసిన నిందితుల కోసం పోలిసులు గాలిస్తున్నారు. లాడ్జిలో ఉన్న సిసీ ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఆదివారం మధ్యాన్నం నుంచి లాడ్జిలో ఉండి మద్యం సేవిస్తున్నట్లు తెలుస్తోంది. రాఘవేంద్ర ఇంటికి వెళ్లి తిరిగి లాడ్జి వచ్చాడు. ఆ తరువాత జరిగిన ఘర్షణలో హత్యకు గురయ్యాడు. హత్యకు పాత కక్షలా, లేక మరోటా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.