
పొరుమామిళ్ళ (Penneru News) : బద్వేల్ నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి రితేష్ రెడ్డి జన్మదిన వేడుకలు పొరుమామిళ్ళ లో టిడిపి శ్రేణులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నాయి. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో యువనేత రితేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎంపీటీసీ కల్వకూరి రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. హాస్పిటల్లో కేక్ కట్ చేసి యువ నాయకునికి శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెరుకూరి చిన్న రాయుడు, మాజీ ఎంపిటిసి నడిపి వెంకటసుబ్బయ్య, హిమా హుస్సేన్, తిరుమల శెట్టి సుబ్బరాయుడు, పాపయ్య, కరిముల్లా, కేశవ, శ్రీకాంత్, నాయబ్, శివకుమార్, నాగేంద్ర, కిషోర్, భాష, నాగరాజు, రాజేష్, మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.