
వేంపల్లి పెన్నేరు న్యూస్ జనవరి 26: వేంపల్లి శ్లోక స్కూల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకలకు మాత్రమే కాదనీ మన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను గుర్తు చేస్తుందన్నారు. ఈ రోజున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజనీ ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులతో సాధికారత కల్పిస్తుందన్నారు ఇది మనమందరం గర్వించాల్సిన, గౌరవించవలసిన రోజని, స్వాతంత్ర్యం కోసం పోరాడి మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసిన మన స్వాతంత్ర్య సమరయోధుల కృషిని గుర్తించడం కోసం మనలో ప్రతి ఒక్కరి బాధ్యతను ప్రతి బింబించాలని అన్నారు. దేశం శాంతి, సమానత్వం, న్యాయంతో అభివృద్ధి చెందుతూనే ఉందన్నారు.మనమందరం మన దేశం యొక్క నిరంతర విజయానికి, అభివృద్ధికి తోడ్పడతామని ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపల్ రమేష్ తో పాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు.