
పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ కొండా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సీఐ శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేసారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత గూర్చి, దేశ స్వాతంత్రం కోసం పోరాటాలు, త్యాగాలు చేసి అసువులు బాసిన మహనీయులైన జాతీయ నాయకుల గురించి సిబ్బందికి వివరించారు. అందరూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు.