
బద్వేల్, జనవరి 26 ( పెన్నేరు న్యూస్):
పురపాలక కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జండా ఆవిష్కరించిన మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరైన బద్వేల్ శాసన సభ్యురాలు డా.సుధారాణి, మునిసిపల్ చైర్మన్ వి.రాజగోపాల్ రెడ్డి .



ముఖ్య అతిథులు మాట్లాడుతూ, స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిన జనవరి 26 ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. పౌరులుగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా నడుచుకోవాలనీ ఆకాక్షించారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్లు ఆర్.వి. సాయికృష్ణ , వై .గోపాల్ స్వామి, వార్డ్ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు, అధికారులు, యన్.సి.సి విద్యార్థులు, ప్రజలు హాజరయ్యారు.