
రాయలసీమ అభివృద్ధికై పోరాడుతాం… ఆర్సీపి రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి
కడప (PENNERU News) :
వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని ఇంతవరకు పాలించిన అన్ని పార్టీలు విస్మరించాయని, ఓట్ల, సీట్ల తక్కువన్న కారణం చేతనే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదని, అధికారంలో ఉన్నది రాయలసీమ వారైనా, అభివృద్ధి అంతా తెలంగాణ, కోస్తాలలో జరిగిందని, రాయలసీమలోని సమస్యలు ఎవరికి పట్టడం లేదని, వాటిని గుర్తించటానికి, సమస్యల పరిష్కారం దిశగా పనిచేయటానికి, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందని, రాయలసీమ అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తుందని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తెలిపారు.

సోమవారం రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడచిన ఎనిమిది సంవత్సరాలు రాయలసీమ అభివృద్ధి కోసం తన శక్తికి మించి విరోచితమైన పోరాటాలు నిర్వహించిందని, అందులో ముఖ్యమైనవి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని 360 రోజుల ఉక్కు నిరాహార దీక్షలు, కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు కోసం రాయలసీమ వ్యాప్తంగా 1200 కిలోమీటర్లు బైక్ యాత్రలు,
అనంతపురంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టు కోసం పాదయాత్రలు, సెంట్రల్ యూనివర్సిటీ కోసం నిరాహార దీక్షలు, ఇళ్లస్థలాలు, భూముల పంపిణీ కోసం కలెక్టరేట్ ముట్టడి, గుంతకల్లు రైల్వే జోన్ కోసం రైల్వే స్టేషన్ ముట్టడి, స్థానిక సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. రానున్న రోజుల్లో రాయలసీమ అభివృద్ధి కోసం మరింత ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తామని, రాయలసీమ నుండి సంస్థలను తరలించడానికి వ్యతిరేకంగా పోరాడుతామని, కడపలో ఉన్న ఏ పి జి బీ ప్రధాన కార్యాలయాన్ని, ఎం ఎస్ ఎం ఈ ట్రైనింగ్ సెంటర్ ను కడపలోనే ఉంచాలని, తిరుపతి టీటీడీ నిధులతో ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను, యూనివర్సిటీలను నెలకొల్పాలని, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సీమలో నూతన ఉపాధి పరిశ్రమలను, వివిధ సంస్థలను, కార్యాలయాలను చేయాలన్నారు.
ఆర్ సి పి 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని, వివిధ ప్రాంతాలలో బాధ్యుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు హాజరై జెండాను ఆవిష్కరించిన వారు, పిఎస్ నగర్ లో ఆర్ సి పి నగర కార్యదర్శి మక్బుల్ భాష, ఆర్కే నగర్ లో నగర కార్యదర్శి వర్గ సభ్యులు మడగలం ప్రసాద్, రాయలసీమ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీదేవి, టూ టౌన్ ప్రాంతంలో ఆర్టియు రాష్ట్ర కార్యదర్శి సిద్దిరామయ్య, ఇందిరానగర్ లో నగర కమిటీ సభ్యులు విజయ్ కుమార్, పాత కడప, బాలాజీ నగర్ లోని రాష్ట్ర కార్యాలయం నందు, రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి అందరూ
శుభాకాంక్షలు తెలుపుకున్నారన్నారు,
కార్యక్రమంలో, నగర కార్యదర్శి వర్గ సభ్యులు,చాపల సుబ్బరాయుడు, రాయలసీమ మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శితస్లీమ్, కరిమున్, వెంకటేష్, అజయ్, పెంచలయ్య, రవి, ముని రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఓబులేసు, షాజహాన్, చిన్నోడు, శ్రీనివాసరెడ్డి, కాసిం, గంగన్న తదితరులు పాల్గొన్నారు.