
మొబలైజేషన్ లో భాగంగా ఎ.ఆర్ సిబ్బంది కి ఫైరింగ్ ప్రాక్టీస్
వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని సిబ్బందికి అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు సూచన
కడప, జనవరి 23 ( పెన్నేరు న్యూస్): జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఏ.ఆర్ పోలీసులకు ఈరోజు ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో, ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య పర్యవేక్షణలో నగర శివార్లలోని ఫైరింగ్ రేంజ్ లో ఏ.ఆర్ పోలీసులకు వివిధ రకాల తుపాకులతో ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. మొబలైజేషన్ లో భాగంగా వార్షిక ఫైరింగ్ లో పాల్గొన్న సిబ్బందికి వృత్తి నైపుణ్యం పెంచుకుందామని సూచించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు గారు సిబ్బందికి ఫైరింగ్ లో మెళకువలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎ.ఆర్ డి.ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్.ఐలు వీరేష్, శ్రీశైల రెడ్డి, టైటాస్, ఆర్.ఎస్.ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

