
మోడీ ప్రభుత్వ విధానాలు దేశానికి ప్రమాదకరం- ప్రొఫెసర్ హరగోపాల్
కడప (PENNERU News): దేశంలో ప్రజాస్వామ్యం మనుగడకు వాటిల్లుతుందని, వాటిని ప్రజలంతా
ఏకమై రక్షించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సామాజిక విశ్లేషకులు, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం కడప నగరంలోని హరిత హోటల్ నందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుర్రప్ప నాయుడు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సెమినార్లో
ప్రొఫెసర్ సాయిబాబా స్మృతి సభలో చట్టం అందరికీ సమానమేనా? అనే అంశం పైన హరగోపాల్ సుదీర్ఘంగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ఉద్యమాల నుంచి స్వేచ్ఛ సమానత్వం, సౌబ్రాతత్వం సామాజిక న్యాయం ఆవిర్భవిం చాయని, అవన్నీ మన రాజ్యాంగంలో ఉన్నాయని, కానీ వాటికి ముప్పు ఏర్పడినప్పుడు ప్రజలు ప్రతికటించేదానికి అవకాశం లేకుండా మన రాజ్యాంగంలో ఉందని ఆయన అన్నారు. అందుకనే అంబేద్కర్ చట్టాలు మంచిగా ఉన్నాయి గాని! వాటిని అమలు చేసేవారు మంచిగా చేస్తే మంచిగా అమలవుతాయి! వ్యతిరేకంగా చేస్తే చట్టాలు చెడుగానే అమలైతాయని ఆయన ఏనాడో చెప్పారని గుర్తు చేశారు.

ఈరోజు పాలకులు, వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తూ, చట్టాలకు అతీతంగా పనిచేస్తూ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారని, ప్రజలు వారిని చట్టబద్ధంగా పని చేయాలని, ప్రజలు మమ్ములను సన్మార్గంలో నడిపించాలని ప్రభుత్వానికి అధికారం ఇస్తే!
ప్రభుత్వాలు ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల పైన, ప్రశ్నించే వారి పైన ఉక్కు పాదం మోపుతున్నారని, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులే కార్పొరేట్ వర్గానికి అండగా ఉంటూ వారికి సమస్తమును దోచిపెట్టడానికి చట్టాలను ఉపయోగిస్తున్నారని, ప్రశ్నించే వారిని అదే చట్టాలతో కటకటాల పాలు చేస్తామని బహిరంగంగా చెబుతున్న దశ ఈరోజు దేశంలో ఉందని ఇది పాసిజానికి నిదర్శనమని అన్నారు.

జైలు ఉన్నవి నేరస్తుల్ని సంస్కరించడానికి కానీ! వారిని వేధించటానికి కాదని, ఏ నేరం చేయని ప్రొఫెసర్ సాయిబాబాను, స్టాండ్లీని అనేక రకాలుగా మానసికంగా హింసించారని ఆయన ఆరోపించారు, ఆఖరకు సుప్రీంకోర్టు సాయిబాబా బైలును నిరాకరించడం కోసం సెలవు రోజునే అత్యవసర సమావేశం ఏర్పరచుకొని నిర్ణయించారని, అదే అరన్నవ్ గోస్వామికి బెయిల్ ఇవ్వడం కోసం సుప్రీంకోర్టు సెలవు దినాన్ని కూడా ఉపయోగించుకొని అర్ధరాత్రి సమావేశమై బెయిల్ మంజూరు చేశారని ఆరోపించారు. ఇటువంటి వ్యవస్థలో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఉన్నారని, కలిసికట్టుగా పోరాడుతూ ఇటువంటి వ్యవస్థలను మార్చాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

సిపిఎం పార్టీ రాంభూపాల్ మాట్లాడుతూ. రాజ్యాంగంలో చట్టం అందరికీ సమానమేనని ఆర్టికల్ 14 చెబుతుంది, అలాగే పేదలకు ఒకరకంగా, సంపన్నులకు మరోరకంగా చట్టం వర్తించే విధంగా మోడీ ప్రభుత్వం మార్చిందని, ముఖ్యంగా కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా చట్టాలు చేయటమే కాక మతతత్వాన్ని కూడా జోడించి చట్టాలను అమలు చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక విద్యుత్ ఒప్పందంలో అదాని అవినీతి గురించి మాట్లాడకుండా ఆయన తరపున పాలకులే అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. నేడు దేశంలో రాజ్యాంగ హేతర విధానం నడుస్తుందని, పిచ్చికి ఒక హద్దు ఉంటుందని మోడీ అణిచివేతకు అద్దె లేదని ఆరోపించారు. దేశంలో కార్మిక చట్టాల సవరణ, రైతుల హక్కులపై అణచివేత, కార్పొరేట్ అనుకూల వర్గాల కోసం చేయూత, ఒక జాతిని నిర్మూలించే మతతత్వం ఆర్ఎస్ఎస్ మోడీ ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తుందని, దీనిని ప్రజలు ఐక్యంగా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.
సిపిఐ గాలి చంద్ర మాట్లాడుతూ, మోడీ వస్తే పనుల భారం తగ్గుతుందని, ప్రభుత్వ రంగ సంస్థలో కాపాడబడతాయని, విదేశాల్లో ఉన్న అవినీతి డబ్బును వెలికి తీస్తారని ఉద్యోగాలు వస్తాయని ప్రజలంతా ధనవంతులు అవుతారని ఎంతో ఆశగా పేద ప్రజలు భావించారని, కానీ నేడు అవన్నీ నిజాలు కావని, ఆయన ప్రభుత్వం తేటతెల్లం చేసిందని ఆయన విమర్శించారు. చెప్పిన వాగ్దానాలను అమలు చేయకుండా శ్రామికులు మహిళలు దళితులు మైనారిటీలు పోరాటం చేస్తూ ఉంటే వారిపైన మోడీ ప్రభుత్వం దాడి చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తూ రాజ్యాంగ విలువలను సమాధి చేస్తున్నారని, ప్రశ్నించే వారిని హక్కుల కోసం నిలబడే వారిని జైలలో వేస్తున్నారని అన్నారు. దేశ సంపదను కొల్లగొట్టిన నీరవ్ మోడీ లాంటి వాళ్లను మోడీ ప్రభుత్వం రక్షిస్తుందని, దీనిని మార్చడమే మన కర్తవ్యం అని ఆయన పిలుపునిచ్చారు.

అర్ సి పి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, డేరా బాబా లాంటి కరుడు కట్టిన నేరస్తులకు బెయిల్ వెంటనే వస్తుందని, నిరపరాధి అయిన ప్రొఫెసర్ సాయిబాబా కు వారి తల్లి మరణిస్తే కడసారి చూసేందుకు పెరోల్ ఇవ్వడానికి నిరాకరించిన వ్యవస్థ లో మనం ఉన్నామని అన్నారు. 90% వికలాంగుడై చక్రాల కుర్చీకే పరిమితమైన సాయిబాబాకు అన్యాయంగా శిక్ష వేసి మానసికంగా వేధించి హింసించి చంపింది ఈ ప్రభుత్వమేనని, ఇది ఓ రకంగా ప్రభుత్వ హత్యానని ఆయన ఆరోపించారు.

అధ్యక్షులు గుర్రప్ప నాయుడు మాట్లాడుతూ, చట్టం అందరికీ సమానమైన, అదే చట్టం పేదలకు ఒక పద్ధతిలో ధనికులకు మరో పద్ధతిగా న్యాయస్థానాల పని చేస్తున్నాయని ఆయన విమర్శించారు. దీనిపైన ప్రజలలో విస్తృతమైన చర్చ జరగాలని ఆయన కోరారు, కార్యక్రమంలో గనుల శాఖ విశ్రాంతి అధికారి గోపాల్, డాక్టర్ రాజా వెంగల్ రెడ్డి, డాక్టర్ ఓబుల్ రెడ్డి,
సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, పౌర హక్కుల నాయకులు వెంకటేశ్వర్లు, ఎలక్ట్రాసిటీ ఇంజనీర్ గుర్రప్ప, ఎల్ఐసి యూనియన్ నాయకులు రఘునాథ్ రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు బాబు భాయ్, జన విజ్ఞాన వేదిక శివరాం, బుద్దిస్ట్ సోషల్ కల్చరల్ సొసైటీ నాయకులు మల్లెల భాస్కర్ యుటిఎఫ్ లక్ష్మి రాజా, కుమారస్వామి రెడ్డి, మున్సిపల్ నాయకులు సుంకరి రవి, ఆర్ సి పి నాయకులు మడగలం ప్రసాద్, విరసం వరలక్ష్మి, సునీత, అరుణ, న్యాయ వాదులు విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజాస్వామ్యవాదులు తదితరులు పాల్గొన్నారు .
