
ప్రొద్దుటూరు (PENNERU News)

ఆరు రోజుల క్రితం ప్రొద్దుటూరు పట్టణంలోని బిజీఆర్ లాడ్జిలో జరిగిన కొప్పుల రాఘవేంద్ర అలియాస్ పప్పి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పాత కక్షల కారణంగానే పప్పిని గాజు మద్యం బాటిల్ తో కొట్టి, ఆపై మీద కూర్చొని గొంతుపై కాలు పెట్టి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసారు. ప్రొద్దుటూరు డిఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో ప్రొద్దుటూరుకు చెందిన యెనమల లోకేశ్వర్ రెడ్డి @ లోకేష్ రెడ్డి, వడ్ల షేక్ ముజీబ్, వేంపల్లి సునీల్ కుమార్ రెడ్డిలను శనివారం ఆర్టీపీపి రోడ్డులో అరెస్టు చేశారు. పాత కక్షలు మనసులో ఉండడము వలన, ముగ్గురు ముద్దాయులు, హత్యకు గురైన రాఘవేంద్ర కుమార్తో కలిసి BGR లాడ్జి 206 రూము తీసుకున్నారని, మద్యం సేవిస్తున్న సందర్భంలో వీరిమధ్య మాటా మాటా పెరగి, అప్పటికే పాత కక్షలు ఉండటం వల్ల మద్యం సీసాతో దాడిచేసి హత్య చేసినట్లు డిఎస్పీ భక్తవత్సలం మీడియాకు తెలిపారు. లిక్కరు బాటిల్తో కొట్టి, తలకు వెనుక వైపు రక్త గాయము చేసి, ఆపై క్రిందకు పడిన పప్పీని కదలకుండా పట్టుకొని, నడుములపై కూర్చోని, గొంతును కాళ్ళతో అదిమి పట్టి, ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడించారని డిఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పనిచేసిన వన్ టౌన్ సిఐ బి రామక్రిష్ణారెడ్డిని , సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.