నారా లోకేష్ యువతకు ఆదర్శం: ఎంపీటీసీ కల్వకూరి రమణ.

పోరుమామిళ్ల,జనవరి 23 ( పెన్నేరు న్యూస్):

నారా లోకేష్ నేటి తరానికి ఆదర్శ నాయకుడని ఆయన అడుగుజాడల్లో యువతరం నడవాల్సిన అవసరం ఉందన్నారు పోరుమామిళ్ల మండలం రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని పోరుమామిళ్లలో ఘనంగా నిర్వహించారు. పట్టణం లోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో టిడిపి నాయకుడు రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలో పెద్ద ఎత్తున వైసిపి నాయకులు శ్రేణులు పాల్గొన్నాయి.  

పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో భారీ కేక్ కట్ చేసి నాయకులు,  అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకూరి రమణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇది ముఖ్యమైన పండగ రోజు అన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ యువతకు ఆదర్శం అన్నారు. లోకేష్ జన్మదిన సందర్భంగా జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. లోకేష్ యువ గళం పేరుతో వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేసి ,  పేద ప్రజల కష్టాలను గమనించి ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి విశేషంగా కృషి చేసినారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం దావోస్ లో వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తున్న మంత్రినారా లోకేష్ ఇంకా ఎదగాలని మరెన్నో పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన్నారు.. ఈకార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చెరుకూరి చెన్నరాయుడు, మల్లికార్జున రెడ్డి, ఇమాం హుస్సేన్, కొండా కృష్ణారెడ్డి, రామసుబ్బారావు, శెట్టెం ప్రతాప్, లేతుమిషన్ షరీఫ్, నాయాబ్, కేశవ, శ్రీకాంత్ ,చిన్న పాపయ్య, శివ ,కరిముల్ల,అన్వర్, నాగేంద్ర, గణేష్, శివ, కార్తిక్, భాష, కిషోర్, శ్యామ్, నారాయణ, కన్నా,సాగర్, చిన్న, నాగూర్,వినయ్, నాసిర్, అతికారి రాజా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share to:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: 😜కుదరదుగా..!
పెన్నేరు ఈపేపర్ కోసం క్లిక్ చేయండి..
This is default text for notification bar