
ప్రొద్దుటూరు మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు (PENNERU News) : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో కార్పొరేషన్ గా తీర్చిదిద్దే క్రమంలో కార్పొరేషన్ స్థాయి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికను తయారు చేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన ఐదు కాలువల అభివృద్ధికి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ను భవిష్యత్తులో కార్పొరేషన్ అవసరాలకు అనుగుణంగా తయారు చేయవలసిందిగా సంబంధించిన కన్సల్టెన్సీ వారికి ఆదేశాలు జారీ చేశారు.
బొల్లవరంలోని మున్సిపల్ లేఅవుట్ ను అభివృద్ధి చేస్తూ ప్లాట్లును త్వరితగతిన వేలంపాట ద్వారా అమ్మకం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పట్టణంలోని మడూరు కాలువ, కొత్తపల్లి కాలువ, ప్రొద్దుటూరు ఛానల్ -1, ప్రొద్దుటూరు ఛానల్ -2, దొరసానిపల్లి ఛానల్ పైన ఉన్న ఆక్రమణలను గుర్తించి, మార్కింగ్ వేసి తొలగించాలని ఎమ్మెల్యే అధికరణ ఆదేశించారు ఈ సమావేశం నందు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు,టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు కన్సల్టెన్సీ సిబ్బంది పాల్గొనడం జరిగినది.
