
వేంపల్లె (పెన్నేరు న్యూస్) ఫిబ్రవరి 16:
గడ్డివాములు దగ్ధం కావడం చాలా బాధకరమని టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వేంపల్లెలో గడ్డి వాములు దగ్ధం కావడంతో టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు వీరబద్ర, మహమ్మద్, డక్కా రమేష్ లు వెళ్లి బాధితులను పరిశీలించడం జరిగింది. అలాగే ఘటనపై బాధితులను అడిగి తెలుసుకున్నారు.

బ్రతుకు దెరువు కోసం పెట్టుకున్న గడ్డి వాములను గుర్తు తెలియని వ్యక్తులు అగ్ని పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. బాధితులకు పరిహరం వచ్చే విధంగా పులివెందుల నియోజకవర్గం ఇన్చార్జి బిటెక్ రవి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పారు. అధికారులు సకాలంలో స్పందించిన ఫలితం లేకుండా పోయిందని చెప్పారు.