
నంద్యాల ( PENNERU News) :
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీ ని వీడి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం ముసలిమడుగు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఎస్ ఎం డి మున్నా, ఆధాం, వకీల్ గపూర్ మీయ్యా, బి. రాజు, మంగళి నాగరాజు, పుల్లన్న, శీలం దాసు తదితరులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ని కలిసి తాము వైసీపీ వీడి టీడీపీ లో చేరుతాం అని కోరగా బైరెడ్డి అంగీకరించి ముసలిమడుగు గ్రామం నుంచి వచ్చిన 50 కుటుంబాల వారికీ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో ముసలిమడుగుకు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తానని, వైసీపీ వీడి టీడీపీ లో చేరిన వారికీ సముచిత స్థానం కల్పిస్తామని బైరెడ్డి వారికీ హామీ ఇచ్చారు.