
సామాజిక మాధ్యమాలలో మహిళలను వేదిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు
నంద్యాల (PENNERU News) :
సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలు, పిల్లలపై వేధింపులకు పాల్పడే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని లోక్ సభలో బుధవారం నంద్యాల ఎంపీ, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి సవివరంగా అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ జవాబు ఇచ్చింది. సామాజిక మాధ్యమాలలో మహిళలు, చిన్నారులను వేదిస్తున్నారని, వారి గౌరవ ప్రతిష్టలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అడిగారు. దీంతో కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ ఎంపీ శబరి అడిగిన ప్రశ్నకు లోక్ సభలో జవాబు ఇచ్చింది. సామాజిక మాధ్యమాలలో మహిళలు, పిల్లలను వేదిస్తూ, అప్రతిష్టపాలు చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ, ఇతరులను దూషించడం సహా సైబర్ నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం రాష్ట్రాలు చర్యలు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. భారత న్యాయ సవిత 2023 చట్టం ప్రకారం సోషల్ మీడియా సైకోలపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని కేంద్రం స్పష్టం చేసింది. మహిళలు, పిల్లలు, వ్యక్తిగత డేటా, వ్యక్తిగత స్వేచ్ఛను, హక్కులను కాపాడేందుకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ యాక్ట్ 2023 అమలులో ఉందని ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.