
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల (PENNERU News)
కేంద్ర ప్రభుత్వం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి శనివారం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షణలో నిర్వహించనున్న ఈ కేంద్రీయ విద్యాలయంలో సీబీఎస్ఈ సిలబస్ ను బోధిస్తారని శబరి వివరించారు. ఈ విద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బిడ్డలకు 50 శాతం సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బిడ్డలకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారటి, ఆర్ధికంగా వెనుకబడ్డ వారి పిల్లలు చదువుకునేందుకు 25 శాతం సీట్లు కేటాయిస్తారని, దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 27 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయగా, ఆంధ్రప్రదేశ్ కు 8 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయగా అందులో నంద్యాల జిల్లా డోన్ పట్టణంకు కేంద్రం కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం సంతోషంగా ఉందని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. ఈ కేంద్రీయ విద్యాలయం వల్ల ప్రతి ఏటా నంద్యాల జిల్లా విద్యార్థులు 960 మంది సెంట్రల్ సిలబస్ తో చదువుకునే అవకాశం ఉందని, 63 మందికి ఉద్యోగాలు వస్తాయని ఇంత మంచి అవకాశం డోన్ పట్టణానికి కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు నంద్యాల జిల్లా ప్రజలతరుపున ధన్యవాదములు తెలుపుతున్నామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.