
ప్రొద్దుటూరు (Penneru news) : స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మూడురోజుల పాటు జరగబోయే IPSGM 2024 ఆటల పోటీలు గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. కడప జిల్లాలోని 15 పాలిటెక్నీక్ కళాశాలల నుండి దాదాపు 450 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని ప్రిన్సిపాల్ జింకా అశోక్ బాబు తెలిపారు. ఈ ఆటల పోటీల కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్,వెంకటసుబ్బయ్య , ఆర్జేడీ ఆఫస్, జయ రామిరెడ్డి, వైవియు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, RCEP కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ అశోక్ బాబు మాట్లాడుతూ, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆటలు ఆడాలన్నారు. జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ, స్పోర్ట్స్ సర్టిఫికెట్ ప్రాముఖ్యతను వివరించారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ, జీవితంలో ఆటల ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని శాఖధిపతి మంజునాథ్ నిర్వహించగా, వివిధ శాఖధిపతులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
