
ప్రొద్దుటూరు, జనవరి 25( పెన్నేరు న్యూస్) : స్థానిక భగత్ సింగ్ కాలనీలో బ్యాగుల తయారీ పరిశ్రమలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పరిశ్రమలో మంటలు వచ్చాయి. దీంతో తయారీ కేంద్రంలో బ్యాగుల మెటీరియల్ పూర్తిగా తగులబడి పోయింది. సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. ఈ మేరకు నష్టం జరిగిందో ఇంకా తెలియ రాలేదు. బ్యాగుల తయారీ పరిశ్రమ ఇళ్ళ మధ్య ఉండటంతో, అగ్ని ప్రమాదం వల్ల చుట్టు పక్కల వారు భయాందోళనకు గురయ్యారు.

