
నంద్యాల (Penneru news): నంద్యాల జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కృషి చేస్తున్నామని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శుక్రవారం తెలిపారు. నంద్యాల జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ (పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ) తెలిపిందని ఎంపీ శబరి చెప్పారు.
నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కేంద్రం నంద్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వంకు విన్నవించారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వంకు ప్రతిపాధన పంపిందని, ఈ రెండు ప్రతిపాదనల అవసరమైన ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ తమకు సమాచారం ఇచ్చినట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.