
రాయలసీమ వ్యాప్తంగా తాసిల్దార్లకు వినతి
ఆర్ సి పి రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి.
కడప (PENNERU NEWS) :
కడపలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించవద్దని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, రాయలసీమ వ్యాప్తంగా తాసిల్దార్లకు వినతి పత్రాలను అందజేశామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తెలిపారు. సోమవారం కడప తాసిల్దార్ కు, పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్ సి పి ఆధ్వర్యంలో తాసిల్దార్లకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. కడప, కమలాపురం, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, చెన్నూరు, వల్లూరు, కాజీపేట, మైదుకూరు, ప్రొద్దుటూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలలోని తాసిల్దార్లకు వినతి పత్రాలు అందజేశామన్నారు. కూటమి ప్రభుత్వం రాయలసీమలోని వివిధ సంస్థలను అమరావతికి తరలించే ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రాలు అందజేసిన వారిలో, ఆర్ సిపి నగర కార్యదర్శి మక్బుల్ బాష, మడగలం ప్రసాద్, తస్లీమ్, లక్ష్మీదేవి, విజయ్, రమేష్, రవి, మునిరెడ్డి, ప్రతాపరెడ్డి,రాజు గంగన్న బాల చెన్నయ్య,షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.