
బద్వేలు, జనవరి 23( పెన్నేరు న్యూస్): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలరెడ్డి పిలుపు మేరకు, “జై బాపు జై భీమ్ జై సంవిధాన్” కార్యక్రమంలో భాగంగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, బద్వేల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎన్ డి విజయ జ్యోతి ఆధ్వర్యంలో, బద్వేల్ బద్వేల్ లోని వివిధ కాలేజీల్లో రాజ్యాంగ ప్రకటనల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విజయ జ్యోతి మాట్లాడుతూ ! కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రాజ్యాంగం పై దాడులు, జాతీయ నాయకులకు అవమానపరిచే విధంగా మాట్లాడుతున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ప్రతి పౌరునికి తెలియాలని ఉద్దేశంతో, అదే విధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ యొక్క కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామని, అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు కార్యక్రమంలో బద్వేల్ మాజీ పట్టణ అధ్యక్షుడు అచ్యుత రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహ, నరసింహ యాదవ్, గుర్రప్ప ,సుధాకర్ రెడ్డి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.