
కర్నూలు, జనవరి 23( పెన్నేరు న్యూస్): మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో దోషికి కర్నూలు జిల్లా స్పెషల్ ఫోక్సో కోర్టు తీర్పు 20 ఏళ్లు జైలు శిక్ష , 10 వేలు జరిమానా విధించింది. కర్నూలు జిల్లా ఎస్పీజి. బిందు మాధవ్ తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలం , గంజహల్లి గ్రామానికి చెందిన జెసిబి డ్రైవర్ దర్గా షేక్షావలి కర్నూలు మహావీర్ నగర్ లో ఉంటున్న మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడు. మైనర్ బాలిక తల్లి గతేడాది ఆగస్ట్ 12వ తేదిన కర్నూలు మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోక్సో యాక్ట్ కింద నిందుతుడిపై అప్పటి మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వెంకటరామయ్య దర్యాప్తు చేపట్టి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు. అన్ని కోణాల్లో విచారించిన కర్నూలు జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి భూపాల్ రెడ్డి నిందితుడిని దోషిగా తేల్చి కి 20 సంవత్సరాల జైలు శిక్ష , రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి ప్రభుత్వం తరపున రూ.2 లక్షల నష్ట పరిహారం ఇవ్వవలసిందిగా ఆదేశించారు.