
ప్రొద్దుటూరు 13వ వార్డు కౌన్సిలర్ , కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా కమీషనర్ కు బహిరంగ లేఖ
(PENNERU NEWS)
ప్రొద్దుటూరు మునిసిపల్ కమిషనర్ గారికి
జనవరి 30, 2025 వ తేదీన ప్రొద్దుటూరు మునిసిపల్ ఛైర్పర్సన్ గారు ఈ రోజు అనగా 31-01-2025 వ తేదీన జరగవలసిన మునిసిపల్ సాధారణ సమావేశం గురించి లేఖ రాసి ఉన్నారు. ఈ రోజు జరగవలసిన సాధారణ సమావేశం వాయిదా వేస్తున్నట్లు తెలిపియున్నారు, ఇందుకు తెలియజేసిన కారణం ఏమిటంటే కొందరు కౌన్సిలర్లు ఆ సమావేశంలో కొన్ని అంశాలపైన ఫైల్స్ చూడాలని కోరగా అందుకు వాయిదా వేస్తున్నట్లు కారణం తెలియచేసారు. ఈ కారణం సరి అయినది కాదు అని ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ విస్వసిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965 లో ఉన్న అధ్యాయము 3, సెక్షన్ – 31 ప్రకారంగా, రికార్డులను తెప్పించుకొనుటకు కౌన్సిలుకు అధికారము ఉన్నది. కౌన్సిలు ఎప్పుడైనను, ఛైర్పర్సనును, అతని అభిరక్షలో ఉన్న ఏదేని డాక్యూమెంటు తమకు సమర్పించవలసిందిగా అభ్యర్తించవచ్చు.
కౌన్సిల్ సభ్యులు వారికి కావలసిన ఫైల్స్ ఎప్పుడైనా తెప్పించుకోవచ్చు, కానీ ఈ కారణం చెప్పి ప్రొద్దుటూరు ప్రజల సమస్యలు, అభివృద్ధి పనులు జరిగే సాధారణ సమావేశాన్ని వాయిదా వేయడం ప్రొద్దుటూరు ప్రజలకు ఇబ్బంది కలిగించినట్లే అని మేము భావిస్తున్నామ. గత నెలలో జరగవలసిన సాధారణ సమావేశం కూడా వాయిదా వేసి ఉన్నారు. కౌన్సిల్ సమావేశం జరగక ఇప్పటికి 2 నెలలు అయింది. ఈ రోజు జరగవలసిన సమావేశం కూడా వాయిదా వేస్తె దాదాపుగా 3 నెలలు అవుతుంది. అంటే ప్రొద్దుటూరు ప్రజల సమస్యలను, అభివృద్ధిని గాలికి వదిలేసినట్టే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రొద్దుటూరు ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజా గొంతుకలా ఉంటుంది, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రొద్దుటూరు అభివృద్ధికి సహకరిస్తుంది.

మీకు సవినయంగా విన్నవిస్తూ ఈ రోజు జరగవలసిన సాధారణ సమావేశం నిర్వహించాలని, ప్రొద్దుటూరు ప్రజా ప్రయోజనాల దృశ్యా మేము డిమాండ్ చేస్తున్నాము.