
పోరుమామిళ్ళ (పెన్నేరు న్యూస్) ః కడప జిల్లా కాశి నాయన మండలంలో టిడిపి బద్వేలు ఇన్చార్జి, యువ నాయకులు రితేష్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మండలంలోని జ్యోతి క్షేత్రంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మండల నాయకులు బసిరెడ్డి రవీంద్రారెడ్డి జ్యోతి పుణ్యక్షేత్రంలో అవధూత కాశిరెడ్డి నాయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి అనాధలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ వేడుకలలో మండల టిడిపి నాయకులు దీన్నేపు కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, పోలిరెడ్డి, సర్పంచ్ ఖాజావలి, జయరాం రెడ్డి, నారాయణరెడ్డి, నర్సిరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, రమణారెడ్డి, మహబూబ్ బాషా, జిలాని, హుస్సేన్ పీరా మరియు నితీష్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.