
వేంపల్లె (పెన్నేరు న్యూస్) జనవరి 23: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను టిడిపి నేతలు ఘనంగా నిర్వహించారు. గురువారం రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టిన రోజు సందర్భంగా వేంపల్లెలోని టిడిపి కార్యాలయంలో టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్ ఆధ్వర్యంలో టిడిపి నేతల సమక్షంలో కేక్ ను కట్ చేసి సంబరాలు చేపట్టారు. అలాగే టిడిపి కార్యకర్తలకు, అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ రామమునిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ప్రజల మన్ననలను పొందిన నాయకుడు మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కొంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. పులివెందుల నియోజకవర్గంలో కూడ టిడిపి బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు, రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తండ్రికి, తాతకు తగ్గ వారసుడిగా నారా లోకేష్ ఎదుగుతున్నట్లు చెప్పారు. యవగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. యువగళంతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారని చెప్పారు. అలాగే ఎక్కడైనా టీడీపీ శ్రేణులకు ఇబ్బందులు ఎదురైన వెంటనే క్షణాల్లో అక్కడకు వెళ్లి పార్టీ శ్రేణులకు అండగా నిలిచారని చెప్పారు. టిడిపి పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారని చెప్పారు. జైలులోని తండ్రి పరామర్శిస్తూనే పార్టీని ఎన్నికలకు రెడీ చేశారని తెలిపారు. లోకేష్ ధైర్యంగా నిలబడిన తీరు నిజంగానే ఆయనలోని అసలు సిసలు నాయకుడిగా జనాలకు పరిచయం చేసిందన్నారు. అభిమన్యుడిలా కాకుండా అర్జునుడిలా ఎన్నికల యుద్ధంలో గెలిచి ప్రత్యర్థులను చిత్తు చేయడంలో లోకేష్ పాత్ర పోషించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి వీరభద్ర షేక్ మొహమ్మద్ తెలంగాణ వల్లి దక్క రమేష్ గోగుల, మారుతి నాగూరు గణపతి రెడ్డి, పి పి చంద్రాయుడు, ఎద్దుల రామ, గణేష్ నాయక్, గొడ్డెళ్ళ శివ, షేక్ ఇలియాస్ వెంకట శివ, డీలర్ ఈశ్వరయ్య, యల్లాక్క గారికొండయ్య, శేషగిరి కుమ్మరంపల్లి రెడ్డయ్య, బాలు భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.