
కడప ఫిబ్రవరి 16 ( పెన్నేరు న్యూస్)
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సోషియాలజీ విభాగం పరిశోధక విద్యార్ధిని ఐ. అరుణ కుమారికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్శిటీలోని సోషియాలజి విభాగానికి చెందిన విశ్రాంతి అధ్యాపకులు యమ్. హనుమంతరావు పర్యవేక్షణలో ‘హెల్త్ కేర్ యిన్ ఆంధ్రప్రదేశ్ ఎ కేస్ ప్రదీసిస్ ఆరోగ్యశ్రీ ద్రోణమ్ యిన్.వై.యస్.ఆర్. డిస్ట్రిక్ట్” అను అంశంపై పరిశోధన గ్రంధాన్ని యునివర్సిటీ కి సమర్పించినట్లు తెలిపారు. ఇందుకు గాను యస్.వి.యు ఐ. అరుణకుమారి కి పిహెచ్.వి. డిగ్రీ ప్రదానం చేసింది. ఐ. అరుణకుమారి కి డాక్టరేట్ అవార్డు రావడం పట్ల పలువురు ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు ఆమెకు అభినందనలు తెలిపారు.