
కడప (PENNERU News) :
దేశ ప్రజలు కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించిన స్వాంత్రత్య సమరయోధుడు అప్సుఖుల్లాఖాన్ జీవిత చరిత్రపై ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించడాన్ని స్వాగతిస్తున్నామని ఫాతిమా మెడికల్ కళాశాల సెక్రటరీ ఏక్యూ జావేద్, ఆప్‌కీ ఆవాజ్ సంస్థ ప్రతినిధి మగ్బూల్‌బాషలు అన్నారు. కడప నగర శివార్లలోని ఫాతిమా మెడికల్ కళాశాలలో ఆప్‌కీ ఆవాజ్ వ్యవస్థాపకులు మగ్బూల్‌బాష ఆధ్వర్యంలో స్వాంత్రత్య సమరయోధుడు అప్సుఖుల్లాఖాన్ జీవిత విశేషాలతో కూడిన పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, భారత దేశ స్వాతంత్య్ర సమరంలో అప్సుఖుల్లాఖాన్ పోషించిన పాత్ర అనితర సాధ్యమన్నారు. ఆంగ్లేయులపై ఆయన సాగించిన పోరాటం నాడు అందరికీ ఆదర్శనీయంగా నిలిచిందన్నారు. అటువంటి మహానీయుని విశేషాలతో కూడిన పుస్తకాన్ని ప్రచురించిన మగ్బూల్‌బాషను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం ద్వారా అప్సుఖుల్లాఖాన్ జీవిత విశేషాలు, సాగించిన స్వాతంత్య్ర పోరాటాన్ని తెలుసుకోవాలన్నారు. నేడు దేశంలో ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహారిస్తున్న వారిపట్ల జాగురూకతతో వ్యవహారిస్తూ కులమతాలు, ప్రాంతాలలకు అతీతంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆప్ కీ ఆవాజ్ కార్యవర్గ సభ్యులు, కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు.