
ఏపీజీబీని తరలిస్తే సీమవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తాం.
RCPరాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి.
కడప ( PENNERU NEWS)
అభివృద్ధి ప్రాంతమైన అమరావతి నుండి రాజధానిని తరలిస్తారన్న వార్తలు ఆ ప్రాంత ప్రజలను ఏళ్ల తరబడి ఉద్యమ బాట నడిపించిందని, నిత్యము కరువు కాటకాలతో ఉండే రాయలసీమలోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని, ఎంఎస్ఎంఈ, ట్రైనింగ్ సెంటర్ను అమరావతికి తరలిస్తున్నారన్న వార్తలు ఈ ప్రాంత ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని, ఈ ప్రాంత అభివృద్ధి మా ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని, ఈ ప్రాంతం నుంచి ఏ సంస్థలను తరలించిన ఊరుకుండేది లేదని, క్షేత్ర స్థాయిలోని ప్రజలందరికీ వాటి ఆవశ్యకతను వివరిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం కడప మరియాపురంలో ఉన్న ఏపీజీబీ ప్రధాన కార్యాలయం ఎదుట రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తరలింపు ఆలోచనలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలకులు రాయలసీమను పూర్తిగా విస్మరించారని, ఆ కోపంతోనే కూటమి ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారని, నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ చేసిన విధానాలనే అనుసరిస్తే! ఈ ప్రాంత ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తారని, ఈ ప్రాంత అభివృద్ధి ఇక్కడి ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని ఇక్కడ నుంచి ఏ సంస్థను తరలించిన ఈ ప్రాంత ప్రజలు ఏమాత్రం సహించరాని ఆయన తెలిపారు. విలీన అనంతరం ఏపీజీబీని అమరావతికి తరలించటం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన వాగ్దానాన్ని రాయలసీమ ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర కానుకగా అందించాలని, ఆయన కోరారు. మీ సొంత ప్రాంతమైన రాయలసీమ పట్ల ఏమాత్రం అభిమానం ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ఏ సంస్థలను తరలించకపోవద్దని, కూటమి ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో మరికొన్ని సంస్థలను పరిశ్రమలను కార్యాలయాలను నెలకొల్పాలని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆర్టియు రాష్ట్ర కార్యదర్శి సిద్ధరామయ్య, ఆర్ సి పి నగర కార్యదర్శి మక్బూల్ బాషా, నగర కార్యదర్శి వర్గ సభ్యులు మడగలం ప్రసాద్, చాపల సుబ్బ రాయుడు, బాల చెన్నయ్య, రమేష్, రవి,శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, రాయలసీమ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తస్లిమ్, లక్ష్మీదేవి, సభ్యులు కరీమున్నీసా, చాంద్ బేగం, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటేశు, నగర కార్యదర్శి అజయ్, రైతు నాయకులు ప్రతాపరెడ్డి, మునిరెడ్డి, ఆర్ టి యు నాయకులు గంగన్న, పెంచలయ్య, ఆప్ కి ఆవాజ్ షాజహాన్, చోటాపీర్ తదితరులు పాల్గొన్నారు