
కడప జిల్లా బద్వేల్, (penneru news)
గత రెండు రోజుల క్రితం నెల్లూరు రోడ్డులోని మడకలవారిపల్లె సుదర్శన ఆశ్రమం వద్ద జరిగిన బస్సు..స్కూటర్ ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి చెందాడు. శ్రీనివాసపురం వద్ద పెట్రోల్ బంకులో పనిచేస్తూ ప్రమాదంలో గాయపడిన స్కూటర్ పైన వస్తున్న యువకుడు బద్వేలు శరత్ కుమార్ తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి పొందినట్లు సమాచారం..

మృతుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రమాదానికి కారణమైన కడప డిపోకు చెందిన హయ్యర్ బస్సు AP39 UG 8250 యాజమాన్యం తో ప్రమాదానికి గురైన యువకునికి మెరుగైన వైద్యం కొరకు సంప్రదింపులు జరుపగా ఇప్పటివరకు స్పందించక పోవడంతో యువకుడు మృతి చెందినట్లు బంధువుల ఆరోపిస్తున్నారు. బస్సు యాజమాన్యం మానవతా దృక్పథంతో మెరుగైన చికిత్స కొరకు కొంతమేర అయినా ఆర్థిక సహాయం కోసం పలుమార్లు పెద్దమనుషుల ద్వారా సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయింది.
బాధితుల అభ్యర్థనకు ఇప్పటి వరకు స్పందించని బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని
కోరుతున్న మృతుని బంధువులు.

ఈ సంఘటనలో డ్రైవర్ ను యాజమాన్యం గురించి అడగగా తనకు యాజమాన్యం ఎవరో తెలియదని..తన డైలీ రూట్ వేరే అని.. ఆ రోజుకి డ్రైవర్ అవసరం అని ఫోన్ చేస్తే వచ్చానని చెబుతున్నాడు…
ఈ ఘటనలో మానవత్వం కోల్పోయి ప్రవర్తించిన యాజమాన్యంతో బద్వేలు ఆర్టీసీ డిపో వారు చేసిన ప్రయత్నంలో కూడా ఫలితం లేకుండా పోయింది.