వక్స్ బోర్డ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్టూ కడపలో ముస్లింల భారీ సదస్సు

కడప నగరంలో జయరాజా గార్డెన్ లో

జమీయతె ఉలమా ఎ హింద్ భారీ బహిరంగ సభ ..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై నిప్పులు చెరిగిన జాతీయ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఆర్షద్ మదని

కడప (PENNERU news) :

వక్స్ బోర్డ్ బోర్డు ఇప్పటిది కాదు 1300 సంవత్సరాల క్రితం నుండి ఉంది, అప్పటి రికార్డులను ఎక్కడినుండి తేవాలి?  బోర్డు కు సంబం ధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ చట్టం తెచ్చింది. బోర్డులో గతంలో 11 మంది సభ్యులు ఉంటే అందరినీ ఎన్నికలతో ఎన్నుకునే వారు అందరూ ముస్లింలు ఉండేవారు. ఈ సవరణ బిల్లులో నలుగురు సభ్యులు ముస్లిం మాత్రమే ఉండడానికి వీలవుతుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బిల్లును వ్యతిరేకించాలని జాతీయ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఆర్షద్ మదని అన్నారు.ఈ బిల్లుతో బోర్డు ఆస్తులను కోల్పోతుంది, మాకు సంబంధించిన బోర్డు ఆస్తులపై మీ పెత్తనం ఏమిటి? ఈ ప్రభుత్వం బోర్డు ఆస్తులపైన కన్నేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీని వ్యతిరేకించాలి. వ్యతిరేకతను తెలియజేయడానికి కడపలో 5 లక్షల మందితో సంతకాలు సేకరించి సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఐదు లక్షల పైచిలుకు మద్దతు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉందన్నారు.

Share to:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: 😜కుదరదుగా..!
పెన్నేరు ఈపేపర్ కోసం క్లిక్ చేయండి..
This is default text for notification bar