
పెన్నేరు న్యూస్, రాజుపాలెం ఫిబ్రవరి 18 :
రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన దద్దనాల జమీల (30) అనే మహిళ, ఆమె పిల్లలు దద్దనాల కమాల్ బాషా (8), దద్దనాల మదియా (6) లు ఈనెల 16వ తేదీన ఆదివారం ఉదయం 06.45 గంటల నుండి కనపడకుండా పోయారని రాజుపాలెం ఎస్సై కత్తి వెంకట రమణ తెలిపారు. ఈ విషయమై రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందని తెలిపారు. కావున ఎవరికైనా వీరి ఆచూకి తెలిసినచో 91211 00600 అనే నంబరుకు తెలియజేయాలని రాజుపాలెం ఎస్సై కత్తి వెంకట రమణ ఒక ప్రకటనలో కోరారు.