
త్రివర్ణ పథకాన్ని ఎగురవేసిన డైరెక్టర్ కుమారస్వామి గుప్త ఏఓ రవికుమార్
వేంపల్లి. పెన్నేరు న్యూస్ జనవరి 26 : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లోనీ ఆర్కే వ్యాలీ క్యాంపస్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్కే వ్యాలీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా పరిపాలనాధికారి రవికుమార్ లు జెండాను ఎగురవేశారు.ఈ సందర్బంగా డైరెక్టర్ మాట్లాడుతూ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని దేశానికి స్వాతంత్రం అందించడంలో అమరులైన దేశ భక్తులకు పోరాట యోధులను కొనియాడారు. క్యాంపస్ లో విద్యను బోధిస్తున్న అధ్యాపకులు,అక్కడ చదువుతున్న విద్యార్థులు వివిధ రంగాలలో అవార్డులు రివార్డులు పొందారు వారిని డైరెక్టర్ మరియు పరిపాలన అధికారి సన్మానించారు క్యాంపస్ లో చదువుతున్న విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నీ చాటే సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ యూనిట్ 12 విద్యార్థులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ అకాడమిక్ వెల్ఫేర్ డీన్లు రమేష్ ,కైలాష్ ,వెంకటేష్, ఎస్టాబ్లిష్మెంట్ కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి ,ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గోన్నారు.