
వేంపల్లి పెన్నేరు న్యూస్ జనవరి 26: వేంపల్లి పట్టణంలోని సంసిద్ధ సతీష్ రెడ్డి పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ రాజ్యసభ సభ్యులు తులసి రెడ్డి జాతీయ పథకాన్ని ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను ఆయన విద్యార్థులకు వివరించారు గణతంత్ర దినోత్సవం భారతదేశం యొక్క గొప్ప ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన వేడుకని మన రాజ్యాంగాన్ని రూపొందించినప్పటి నుంచి దానిని స్వీకరించే వరకు భారతదేశం ప్రతి పౌరుడి స్వరానికి నిజంగా విలువనిచ్చే గణతంత్ర రాజ్యంగా అవతరించిం దన్నారు. భారతదేశం విభిన్న సంస్కృతులు, భాషలు, మతాలు శాంతియుతంగా సహజీవనం చేసే అపారమైన వైవిధ్యభరితమైన భూమి. గణతంత్ర దినోత్సవం మనకు భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తు చేస్తుందన్నారు. ప్రతి పౌరుడు సామరస్యంతో జీవించడానికి మన రాజ్యాంగం పునాది వేసింది. ఈ రోజు మనం ఈ చారిత్రాత్మక దినాన్ని జరుపు కుంటున్నప్పుడు ఈ వైవిధ్యాన్ని స్వీకరించి ఐక్యమైన, సంపన్నమైన భారతదేశం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ,వైస్ ప్రిన్సిపాల్ పరిమళ దేవి, లోకేష్,రాయుడు అధ్యాపకులు పాల్గొన్నారు.
