
గణతంత్ర దినోత్సవ స్పూర్తితో ఉత్తమ సేవలు అందించాలి సర్పంచ్ ఆర్.శ్రీనివాసులు
వేంపల్లె : పెన్నేరు న్యూస్ జనవరి 26 : స్థానిక పంచాయతీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సర్పంచ్ ఆర్.శ్రీనివాసులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సర్పంచ్ తో పాటు, వార్డు సభ్యులు, పంచాయతీ ఇఓ, సిబ్బంది గౌరవ వందనం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ పూర్తి రాజ్యాంగ బద్ధంగా పాలన సాగించుకునే రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని, అదే స్ఫూర్తితో మరింత ఉత్తమ సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఇఓ సుబ్బారెడ్డి, వార్డు సభ్యులు అంజి, నరసింహ గౌడ్, హరి, సునీల్, బికారి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.