
కడప (PENNERU News): సాగునీటి ఎన్నికల కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై కర్రలు, రాళ్లతో దాడి చేసారు. సాగునీటి ఎన్నికల పోటీ చేసే రైతులు తమకు కావలసిన పత్రాల కోసం వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న తతంగంపై కవరేజికి వెళ్లిన సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్, కెమెరా మెన్ రాము, పేపర్ రిపోర్టర్ రాజారెడ్డి పై టీడీపీ నేతల దాడి చేసినట్లు తెలుస్తోంది. వేముల ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉన్న మీడియాపై పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగినట్లు సమాచారం.. సాగు నీటి ఎన్నికల కవరేజ్ కి వెళ్ళిన సాక్షి టీవీ జర్నలిస్టులపై కర్రలు, రాళ్ళతో దాడి చేయడంపై జర్నలిస్టుల సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అధికార పార్టీ నేతల దాడిలో గాయపడ్డ సాక్షి టీవీ స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్, కెమెరా మెన్ రాము, పేపర్ రిపోర్టర్ రాజారెడ్డి లను వేముల పోలీస్ స్టేషన్ వద్ద కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు.

సాక్షి ప్రతినిధులపై దాడి హేమమైన చర్య – APUWJ
కడప : వైయస్సార్ జిల్లా వేముల మండల కేంద్రం లో నీటిసంఘాల ఎన్నికల ప్రక్రియ కవరేజ్ కు వెళ్లిన సాక్షి టివి కరస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము , సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డి లపై రాళ్లతో దాడి చేయడం హేమమైన చర్య అని APUWJ రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి , జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటరెడ్డి , జిల్లా అధ్యక్షడు బాలక్రిష్ణారెడ్డి , ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి , అధ్యక్ష కార్యదర్శులు రమణారెడ్డి , రాజు లు ఒక ప్రకటన లో ఖండించారు. కవరేజ్ లో ఉన్న రిపోర్టర్ లపై దాడి చేయడం , కెమెరా , ఫోర్ జి లైవ్ కిట్టును ధ్వంసం చేయడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి మీడియా ప్రతినిధులపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని APUWJ నాయకత్వం డిమాండ్ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు
సాక్షి మీడియా ప్రతినిధులు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం…TJF.. తెలుగు జర్నలిస్ట్ ఫోరం..
కడప జిల్లా వేముల మండలం లో సాక్షి ప్రతినిధులపై దాడులు చేయడం హేయనియమని తెలుగు జర్నలిస్ట్ ఫోరం జిల్లా గౌరవ అధ్యక్షులు రఘునాధ్, జిల్లా కన్వీనర్ శ్రీకాంత్, కో కన్వీనర్ కృష్ణమూర్తి, ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ కిషోర్, కో కన్వీనర్ రామచంద్ర, గౌరవ సలహాదారులు సుధీర్ తీవ్రంగా మండిపడ్డారు. కవరేజ్ నిమిత్తం వెళ్లిన సాక్షి ప్రతినిధులపై దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. మీడియా ప్రతినిధులపై దాడులు చేస్తే సహించేది లేదని తెలుగు జర్నలిస్ట్ ఫోరం నాయకులు తెలిపారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు.

వైసిపి మద్దతు దారులు