
అమరావతి (Penneru News) :
రాజ్యసభ సభ్యుల ఎంపికపై టిడిపి, జనసేనల మధ్య కీలక చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బిజేపి ప్రతిపాదనలను కూడా చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వ భాగస్వామి అయిన డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్‌ల మధ్య జరిగిన చర్చలల్లో రాజ్య సభ సభ్యుల ఎంపిక, బిజేపి ప్రతినిదన వంటి కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్ బిజేపీ పెద్దలతో మాట్లాడిన విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలు, కాకినాడలో రేషన్ బియ్యం మాఫియా పైనా సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు సమాచారం. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై ప్రభుత్వం చేపట్టిన చర్యలు దాని పరిణామాలపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది..
వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన మూడు స్థానాల్లో.. ఎన్నికలు జరగనున్నాయి.. మంగ్లవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానున్న నేపధ్యంలో ఇరు అగ్ర నేతల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాజ్యసభ రేసులో టీడీపీ నుంచి మాజీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, ఇక గుంటూరు ఎంపీ సీటును త్యాగం చేసిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ రేసులో ఉన్నట్లు తెలస్తోంది. జనసేన కూడా ఓ స్థానాన్ని అడుగుతున్నట్లు సమాచారం.. పొత్తు ధర్మంలో భాగంగా.. అనకాపల్లి లోక్ సభ సీటుని త్యాగం చేసిన మెగాబ్రదర్ నాగబాబు కూడా రేసులో ఉన్నారని సమాచారం.. బీజేపీ కూడా కూటమి పొత్తులో భాగంగా ఒక సీటును ఆశిస్తున్నట్టు సమాచారం. ఆపార్టీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి రేసులో ఉన్నట్లు సమాచారం..