
విజయవాడ, జనవరి 26(పెన్నేరు న్యూస్): 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలోని సింగ్ నగర్ షాది ఖానాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ హాజరయ్యారు. ముందుగా వారు జాతీయ పథకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ లు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల కృషితో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని వారి త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలని ప్రపంచం లో కెల్లా భారత రాజ్యాంగం ఎంతో పవిత్రమైందని సెక్యులరిజానికి భారతదేశం నాంది అని రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి పౌరుడు ముందుకు తీసుకుని వెళ్లాలని వారు పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం అమలు వచ్చిన రోజుగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని భారత దేశంలో పౌరులు తమ హక్కులు కాపాడుకొని ముందుకు సాగాలని వారు పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా భారత రాజ్యాంగం ఉందని భారతదేశ అఖండత కోసం భారతదేశ ప్రతి పౌరుడు కోసం సమాన హక్కుల కోసం భారతదేశ అఖండత కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.