
పోరుమామిళ్ల, జనవరి 26( పెన్నేరు న్యూస్): పట్టణంలో 76వvగణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 76వ గణతంత్ర వేడుకలు సందర్భంగా పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచి యనమల సుధాకర్ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినా, 1950 దశకంలో దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించిందని స్వాతంత్రం తరువాత గణతంత్ర స్వరాజ్యం సిద్ధించిందన్నారు. స్వాతంత్రం తరువాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26 న భారత్ అవతరించిందని అదే రిపబ్లిక్ డే అన్నారు. జనవరి 26, 1950 బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయిందని మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన దార్శనికులు, మేధావులు, రాజ్యాంగ పరిషత్ ను ఏర్పాటు చేశారని, రాజ్యాంగ అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ ను ఎన్నుకోగా, చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ నియమించారని రాజ్యాంగాన్ని నిర్మించేందుకు 11 నెలల 18 రోజులు కాలం పట్టింది అని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య రాజ్యంగా రూపొందిందని తెలిపారు. మనం ఎక్కడున్నా భరతమాత బిడ్డలమని మరవకూడదని ఆయన తెలిపారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు పూలమాలతో శాలువా కప్పి సత్కరించారు. అలాగే పంచాయతీ మెంబర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ప్రోలు మురళి యాదవ్, మాజీ ఎంపీటీసీ ఇమామ్ హుస్సేన్, సుబ్బారావు, అతి కారి రాజా, నేటి పారుదల సంఘ చైర్మన్ వెంకటయ్య, చెన్ను రమణ, లారీ అసోసియేషన్ ఓనర్ సుబ్బారావు, లక్ష్మణరావు, హఫీజ్, పఠాన్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.